విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) . ‘దొరసాని’ (Dorasaani) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతను.. ఆ సినిమాతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ (Middle Class Melodies) ఓటీటీలో రిలీజ్ అయ్యి డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘పుష్పక విమానం’ (Pushpaka Vimanam) ‘హైవే’ (Highway) చిత్రాలు నిరాశపరిచాయి. అయినప్పటికీ గత ఏడాది వచ్చిన ‘బేబీ’ (Baby) తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఆనంద్.
వాస్తవానికి ఆ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ హీరోయిన్ వైష్ణవి చైతన్యకి (Vaishnavi Chaitanya) వెళ్ళింది. పైగా ఆనంద్ తో పాటు అందులో విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) అనే మరో హీరో కూడా ఉన్నాడు. ఆనంద్ దేవరకొండ ఆ సినిమాకి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కాదనలేం. కానీ తన నెక్స్ట్ సినిమాతో సక్సెస్ కొడితేనే అతని క్రేజ్ బలపడుతుంది.. నిలబడుతుంది. లేదు అంటే ‘బేబీ’ తో కంపేర్ చేసి నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేసే ప్రమాదం కూడా ఉంది.
ఆనంద్ దేవరకొండ నెక్స్ట్ మూవీ అయిన ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha) మే 31 న రిలీజ్ కాబోతోంది. ‘హై-లైఫ్ ఎంటర్టైన్ మెంట్’ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న మూవీ ఇది. అంతేకాదు ఆనంద్ దేవరకొండ మొదటిసారి చేస్తున్న కంప్లీట్ యాక్షన్ మూవీ. మరి ఇది సక్సెస్ అయ్యి ఆనంద్ కి ఇంకో హిట్ ఇస్తుందో లేదో చూడాలి