కొరటాలకి వర్కౌట్ కాలేదు.. అనిల్ కు వర్కౌట్ అవుతుందా?

రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుల లిస్ట్ లో కొరటాల శివ, అనిల్ రావిపూడి వంటి దర్శకులు ఉండేవారు. ఈ ఇద్దరి దర్శకుల స్పెషాలిటీ ఏంటంటే.. పాత కథలనే తీసుకుని అభిమానులకి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి ప్రేక్షకులకు అందించి హిట్లు కొట్టగలరు. అయితే కొరటాల సినిమాల్లో మెసేజ్ ఉంటుంది, అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ ఉంటుంది. అయితే వీళ్ళదిరికీ ఉన్న ఇంకో సిమిలర్ క్వాలిటీ ఏంటంటే.. వీళ్ళతో సినిమా చేసిన ప్రతీ హీరోకి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ను అందించారు.

అయితే కొరటాల శివకి ‘ఆచార్య’ చిత్రం కోలుకోలేని దెబ్బ కొట్టింది. అతని వరుస విజయాలకు బ్రేక్ వేసింది. ఇప్పుడు మళ్ళీ మొదటి నుండీ అతను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి పరిస్థితి ఏంటి? అంటూ ఓ ప్రశ్న అందరిలో మొదలైంది. ‘ఎఫ్3’ చిత్రంతో అతను మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటివరకు అతను తెరకెక్కించిన ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇలా 5 హిట్లు అందుకున్నాడు.

ఇప్పుడు ‘ఎఫ్3’ తో మరో హిట్ అందుకుని డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తాడా లేక కొరటాల శివలా చతికిలపడతాడా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ‘ఎఫ్ 2’ సినిమాలో సిల్లీ కామెడీ ఎక్కువగా ఉంటుంది. కానీ సంక్రాంతి సీజన్, వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ ఆ చిత్రాన్ని గట్టెక్కించాయి.

‘సరిలేరు నీకెవ్వరు’ లో కూడా సిల్లీ కామెడీ ఉంటుంది కానీ మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఆ సినిమాని నిలబెట్టాయి. అయితే ‘ఎఫ్3’ లో కూడా ‘ఎఫ్2’ లో ఉన్న సిల్లీ కామెడీ మాత్రమే ఉంటే బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడం కష్టమనే చెప్పాలి..!

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus