ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందుగానే ఆర్ఆర్ఆర్ మేకర్స్ దరఖాస్తు చేసుకోవడంతో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏ సెంటర్లలో ఆర్ఆర్ఆర్ బాల్కనీ టికెట్ ధర కనీసం 206 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. బీ సెంటర్లలో ఆర్ఆర్ఆర్ బాల్కనీ టికెట్ ధర 183 రూపాయలుగా ఉండనుందని సమాచారం. సి సెంటర్లలో బాల్కనీ టికెట్ ధర కనీసం 170 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.
భీమ్లా నాయక్ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచడంతో పవన్ సినిమాకు ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరలేదు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని కామెంట్లు వినిపించాయి. పవన్ తర్వాత సినిమాల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించనుందని ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలు కాగా రెమ్యునరేషన్లు కాకుండా ఈ సినిమా బడ్జెట్ 140 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. మరి ఏపీ ప్రభుత్వం ఈ సినిమా విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. ఏపీ సర్కార్ హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం కల్పిస్తుందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హరిహర వీరమల్లు ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
ఈ సినిమా ఏపీలో 20 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటే మాత్రం ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు కూడా అదనపు ప్రయోజనాలు కల్పించాలి. హరిహర వీరమల్లు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించనుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!