AR Rehaman, Ram Charan: ఏఆర్ రెహమాన్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా.. ఏం జరిగిందంటే?

  • January 8, 2024 / 09:42 AM IST

చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒకింత భారీ బడ్జెట్ తో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సమ్మర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారని గతంలో ప్రచారం జరగగా తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.

అయితే రెహమాన్ పని చేసిన స్ట్రెయిట్ తెలుగు సినిమాలలో ఏ మాయ వేశావె లాంటి కొన్ని సినిమాలు తప్ప మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు. తెలుగులో ఏఆర్ రెహమాన్ పని చేసిన సినిమాలు కూడా చాలా తక్కువనే సంగతి తెలిసిందే. చరణ్ బుచ్చిబాబు సినిమాతో ఈ నెగిటివ్ సెంటిమెంట్ బ్రేక్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో ఏఆర్ రెహమాన్ మరింత బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ 2025 సంవత్సరంలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. బుచ్చిబాబు ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బుచ్చిబాబు పేరు మారుమ్రోగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు రామ్ చరణ్ ఒకింత భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

చరణ్ ఇకపై వేగంగా సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అనువాద చిత్రాలలోని పాటల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఏఆర్ రెహమాన్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. రెహమాన్ ఈ సినిమాకు ఎలాంటి పాటలు ఇస్తారో చూడాల్సి ఉంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus