Balakrishna: ఆ డైరెక్టర్ కు బాలయ్య ఛాన్స్ ఇవ్వడం సాధ్యమేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను, బాబీ డైరెక్షన్ లో బాలయ్య తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయి. ఈ రెండు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలతో పాటు బాలకృష్ణ శివరాజ్ కుమార్ తో కలిసి ఒక సినిమాలో నటించనున్నారు. గతంలో ఈ కాంబినేషన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తెరకెక్కింది.

అయితే భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న బాలయ్య శివరాజ్ కుమార్ కాంబో సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం వినిపిస్తోంది. ప్రముఖ కన్నడ డైరెక్టర్ కు ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కన్నడ డైరెక్టర్ హర్ష ఈ భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. వేద, భజరంగి సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలో హర్ష మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. చాలామంది డైరెక్టర్లతో పోల్చి చూస్తే హర్ష సక్సెస్ రేట్ కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే.

హర్ష మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని రజనీకాంత్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందని స్క్రిప్ట్ పనులు పూర్తైన తర్వాత ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలపై దృష్టి పెడుతున్నా బాలయ్య మాత్రం మల్టీస్టారర్ సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

అయితే బాలయ్య (Balakrishna) కథ నచ్చితే ఇకపై మల్టీస్టారర్ సినిమాలలో కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. ఒక్కో ప్రాజెక్ట్ కు 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్ ను అలరించే సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కెరీర్ విషయంలో బాలయ్య ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. హర్షకు బాలయ్య ఛాన్స్ ఇస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus