ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో ఏం చేసినా సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ ట్విట్టర్ లో చేసే పోస్ట్ ల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. బండ్ల గణేష్ కు ట్విట్టర్ లో 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఓటు వేసి తనను గెలిపించాలని బండ్ల గణేష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన బండ్ల గణేష్ కు ఆ పార్టీ గెలవకపోవడం ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో షాక్ తగిలింది. 2018 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసి పొలిటికల్ హీట్ పెంచిన బండ్ల గణేష్ ఆ తర్వాత ఆ వ్యాఖ్యల విషయంలో వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ పోటీ చేస్తున్న ఎన్నికలు రాజకీయాలకు సంబంధించిన ఎన్నికలు మాత్రం కాదు.
త్వరలో హైదరాబాద్ లో ఎఫ్.ఎన్.సీ.సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బండ్ల గణేష్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనున్నారు. మీ చేతులలో మార్చే శక్తి ఛాన్స్ ఉందని మీ అమూల్యమైన ఓటును నాకే వేయాలని బండ్ల గణేష్ పేర్కొన్నారు. బండ్ల గణేష్ ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
బండ్ల గణేష్ తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చేసిన ప్రకటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాకేం చేస్తావ్ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక నియోజకవర్గానికి పోటీ చేయాల్సిన బండ్ల గణేష్ క్లబ్ రేంజ్ ఎన్నికలకు పడిపోవడం ఏంటని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బండ్ల గణేష్ పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.