పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా 130 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే ఈ హక్కుల విలువ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటుందని చెప్పవచ్చు. భీమ్లా నాయక్ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.
భీమ్లా నాయక్ సినిమా తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ సైతం భీమ్లా నాయక్ సినిమా విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. అజ్ఞాతవాసి చేదు ఫలితానికి ఈ సినిమాతో త్రివిక్రమ్, పవన్ చెక్ పెడతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్ అజ్ఞాతవాసి తర్వాత డైరెక్షన్ చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్ కాకపోయినా సినిమాపై ఆయన ముద్ర అయితే ఉంటుందని తెలుస్తోంది.
మలయాళంలో లేని సన్నివేశాలు కూడా తెలుగులో భీమ్లా నాయక్ సినిమాలో ఉంటాయని సమాచారం అందుతోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో పవన్ యంగ్ గా కనిపిస్తారని ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఆ సన్నివేశాలు ఉంటాయని బోగట్టా. ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు అయినా నిర్మాతలకు విడుదలకు ముందే భారీ మొత్తంలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాసినిమాకు పవన్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. పవన్ రానా కాంబోలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని తెలుస్తోంది. మలయాళంలో తెరకెక్కిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కగా ఒరిజినల్ ను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!