Buchi Babu: బుచ్చిబాబు కల నెరవేరడం సాధ్యమేనా..?

గత కొన్నేళ్లలో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్లు భారీగా పెరిగాయి. నిర్మాతలు సైతం సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లకు, భారీ లాభాలను తెచ్చిపెట్టే డైరెక్టర్లకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. సుకుమార్ అసిస్టెంట్ గా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానాకు ఆ సినిమా సక్సెస్ సాధించడంతో మంచి పేరుతో పాటు గుర్తింపు దక్కింది. ఉప్పెన సక్సెస్ వల్ల స్టార్ హీరో ఎన్టీఆర్ నుంచి బుచ్చిబాబుకు పిలుపు కూడా వచ్చింది.

బుచ్చిబాబు డైరెక్షన్ లో నటించబోతున్నట్టు ఎన్టీఆర్ అధికారిక ప్రకటన చేయకపోయినా బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నానని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటన చేశారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. దాదాపు మూడేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకే పరిమితమయ్యారు. ఎన్టీఆర్ కెరీర్ లో సినిమాసినిమాకు మూడేళ్ల గ్యాప్ రావడం ఇదే తొలిసారి.

ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి కనీసం రెండున్నరేళ్ల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. బుచ్చిబాబు మరో చిన్న ప్రాజెక్ట్ చేసి ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోతే మాత్రం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశం ఉంది. ఈ రీజన్ వల్లే బుచ్చిబాబు సానా కొత్త సినిమా ప్రకటన రావడం లేదని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ తో సినిమా తీయాలన్న బుచ్చిబాబు కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే కొన్నేళ్లు ఆగాల్సిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus