సంక్రాంతి పండుగ కానుకగా మూడు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు పైచేయి సాధించాయి. ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తుండగా ఈ సినిమాలు సైతం రికార్డులు క్రియేట్ చేసే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. అయితే కొన్ని వారాల క్రితం వరకు మునుపటి స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి.
కొన్ని సినిమాలకు హిట్ టాక్ వచ్చినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించడంలో ఫెయిల్ కావడంతో సంక్రాంతి సినిమాల ఫలితాల గురించి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే ప్రేక్షకుల్లో నెలకొన్న సందేహాలకు చిరంజీవి, బాలయ్య చెక్ పెట్టారు. చిరంజీవి, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. చిరంజీవి, బాలయ్య ఎంట్రీతో ప్రేక్షకుల్లో అభిప్రాయం మారిందని ప్రేక్షకులలో కరోనా భయాలు కూడా తొలగిపోయాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
వేర్వేరుగా ఈ రెండు సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఈ రెండు సినిమాలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తుండటంతో నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలు వస్తున్నాయని సమాచారం అందుతోంది. చిరంజీవి, బాలయ్య సంక్రాంతి విజేతలుగా నిలవడం గమనార్హం.
రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమాలు భారీగా కలెక్షన్లు సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాలకు ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రావడం లేదు. చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి సినిమాలతో కెరీర్ బెస్ట్ హిట్లను సొంతం చేసుకున్నారు.