Chiranjeevi, Balakrishna: ఆ మ్యాజిక్ ను చిరంజీవి, బాలయ్య రిపీట్ చేస్తారా?

2023 సంక్రాంతి పండుగ కానుకగా వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోని 1300 థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాలకు బుకింగ్స్ మొదలు కాగా వీరసింహారెడ్డికి ఊహించని స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. 2020 సంవత్సరంలో ఒక్కరోజు గ్యాప్ లో విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించగా వాల్తేరు వీరయ్య,

వీరసింహారెడ్డి సినిమాలు కూడా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం తెగింపు, వారసుడు సినిమాలకు కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాలకు మంచి టాక్ వచ్చినా తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. 2020 సంక్రాంతి మ్యాజిక్ ను చిరంజీవి, బాలయ్య ఈ ఏడాది రిపీట్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

ఒకవేళ రిపీట్ చేస్తే మాత్రం చిరంజీవి, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రికార్డులను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ రెండు సినిమాల నుంచి విడుదలవుతున్న పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ రెండు సినిమాల ట్రైలర్లతోనే ఈ సినిమాల రిజల్ట్ గురించి క్లారిటీ రానుందని మరి కొందరు చెబుతున్నారు.

చిరంజీవి, బాలయ్య తర్వాత సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి, బాలయ్య రెమ్యునరేషన్ కూడా ఈ మధ్య కాలంలో భారీ స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది. చిరంజీవి, బాలకృష్ణ తర్వాత సినిమాల షూటింగ్ లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus