Dunki, Salaar: ‘డంకీ’ ఉండగా.. ‘సలార్’… ‘యానిమల్’ కలెక్షన్స్ ను కూడా దాటలేదట..!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ వంటి చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందిన ‘యానిమల్’ సినిమా ఇటీవల అంటే డిసెంబర్ 1 న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ట్రైలర్ తోనే బోలెడంత బజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. మొదటిరోజే రూ.116 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించి.. చరిత్ర సృష్టించింది.

మొదటిరోజే వంద కోట్ల పైగా వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్లో రాజమౌళితో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా నిలిచాడు. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే ‘యానిమల్’ ఇప్పుడు ప్రభాస్ ‘సలార్’ కి పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసిందని అంతా చెప్పుకుంటున్నారు.

ఎందుకంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్'(మొదటి భాగం) పై నార్త్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. కానీ దానికి ఆడియన్స్ నుండి పాజిటివ్ రియాక్షన్ అయితే రాలేదు. అయినప్పటికీ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ కొద్దీ ఓపెనింగ్స్ అయితే భారీగా నమోదవుతాయి. అవి ‘యానిమల్’ కలెక్షన్స్ ను టచ్ చేసే విధంగా ఉంటాయా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఎందుకంటే.. ‘సలార్’ కంటే ఒక రోజు ముందు షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ సినిమా రిలీజ్ కాబోతుంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు కావడం, అలాగే ‘పఠాన్’ ‘జవాన్’ చిత్రాలతో షారుఖ్ ఖాన్ భీభత్సమైన ఫామ్లో ఉండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సినిమా ‘సలార్’ ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అప్పుడు ‘యానిమల్’ కలెక్షన్స్ ను ‘సలార్’ (Salaar) టచ్ చేయడం కూడా కష్టమైపోతుంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus