Vakeel Saab: డిస్ట్రిబ్యూటర్లను కలవపెడుతున్న విషయమదే!

‘వకీల్ సాబ్’ సినిమాను భారీ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు కరోనా టెన్షన్ మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకి రెండు, మూడు వందల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అధికార లెక్కల ప్రకారం 1300 కేసుల వంతున రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నమోదవుతున్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ కు మరో నాలుగు రోజుల సమయం ఉంది. అప్పటికి కరోనా ఇదే వేగంతో వ్యాపిస్తే కేసులు మరింత పెరిగిపోయే అవకాశం ఉంది.

ఇలాంటి సమయంలో ‘వకీల్ సాబ్’ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి ధైర్యం చేస్తారా..? అనేది ప్రశ్నగా మారింది. ఫ్యాన్స్ తో ఎలాంటి సమస్య ఉండదు. అలానే యూత్ కూడా సినిమాకి వచ్చేస్తారు. కానీ ఈ నెంబర్ మూడు రోజుల కలెక్షన్స్ కి సరిపోతుంది. తరువాత మంచి నెంబర్లు రావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు రావాలి. ‘వకీల్ సాబ్’ మహిళలు చూడాల్సిన సినిమా అని ఎంతగా ప్రచారం చేస్తున్నా.. ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి ధైర్యం చేస్తాయా అనేది తెలియాల్సివుంది.

పైగా ఈ నెలలో స్కూల్ స్టూడెంట్స్ కి పరీక్షలు ఉన్నాయి. ఇంటర్ వాళ్లకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఫ్యామిలీలు థియేటర్ వస్తాయా అనేది సందేహమే. రాకపోతే వీక్ డేస్ లో సినిమా పరిస్థితి ఏంటని డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమాకి గనుక ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోతే తరువాత రాబోయే సినిమాలపై కూడా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus