‘ఫోటో’ అనే సినిమాతో నటిగా మారిన అంజలి (Anjali) .. ఆ తర్వాత ‘బింబిసార’ (Bimbisara) దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vassishta) హీరోగా తెరకెక్కిన ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. కానీ ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె కోలీవుడ్ చెక్కేసింది. అక్కడి ప్రేక్షకులు మాత్రం ఈమెను నెత్తిన పెట్టుకున్నారు. ‘షాపింగ్ మాల్’ ‘జర్నీ’ (Journey) వంటి వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ( Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది.
అప్పటి నుండి అంజలి ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈమె చేతిలో ఆఫర్లు ఉన్నాయి. ఆల్రెడీ 50 సినిమాల్లో నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ గా ఈమె రికార్డు కూడా సృష్టించింది. ఆమె నుండి రాబోతున్న ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) సినిమా ఆమెకి 50 వ సినిమా కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఈ 2024 లో అంజలి నుండి 3 సినిమాలు రాబోతున్నాయి.
అవే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari) ‘గేమ్ ఛేంజర్’ (Game Chnager) . సరిగ్గా గమనిస్తే.. ఈ మూడు సినిమాల పేర్లు ఇంగ్లీష్ లో ‘G ‘ అనే లెటర్ తో ప్రారంభమవుతున్నాయి. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ లో ఈ విషయం పై ఆమెను ప్రశ్నించగా.. ‘అన్ని G అనే లెటర్ తోనే స్టార్ట్ అవుతున్నాయి అంటే నా గ్రహాలు(‘G’rahalu) బాగున్నాయి అన్నమాట’ అంటూ చెప్పుకొచ్చింది.