డిసెంబరు మొదటి వారం సినిమాల పంచాయితీ జరుగుతున్న రోజులవి.. అంటే మరీ ఎక్కువ రోజులు అవ్వలేదు అనుకోండి. ఓ పదిహేను రోజుల క్రితం మాట అది. ఓ యువ హీరో చాలా అగ్రెసివ్‌గా ‘ఒకవేళ అదే జరిగితే ఆ సినిమా ప్రచారానికి నేను రాను’ అని కరాఖండీగా చెప్పేశాడు. దీంతో అంత కోపంగా ఎందుకున్నాడు, ఏమైంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపై వివరణ వస్తుందేమో అనుకుంటే ఇంతవరకు ఆ హీరో నుండి కానీ, ఆ టీమ్ నుండి కానీ వివరణ రాలేదు.
ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది. మేం చెప్పిన హీరో విశ్వక్‌సేన్ అని, ఆ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని. ఈ సినిమా గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 8న కాకుండా 29న రిలీజ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు చర్చలు తుది దశలో ఉన్నాయని చెబుతున్నారు. దీంతో మరి అప్పుడు విశ్వక్ సేన్ చెప్పిన మాట ఇప్పుడు ఉంటాడా అనే ప్రశ్న మొదలైంది.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా గురించి టీమ్ చాలా రోజుల క్రితమే తమ సినిమా ప్రచారం ప్రారంభించింది. వివిధ కారణాల వల్ల, చాలా మార్పుల తర్వాత సినిమాను డిసెంబరు 8న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్‌ను కూడా మారుస్తున్నారు అని ఆ మధ్య టాక్ వచ్చింది. ఆ సమయంలోనే విశ్వక్‌సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారు అంటూ వైరల్ కామెంట్స్ చేశాడు.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాను తొలుత అనుకున్న తేదీకే విడుదల చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని క్లారిటీ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. తగ్గేకొద్దీ మనల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తుంటారని అర్థమైంది. సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాం. డిసెంబర్ 8 సివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లిపై ఒట్టు. మహాకాళి మాతో ఉంది అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అంతేకాదు డిసెంబర్‌లో కనుక (Gangs of Godavari) ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రాకపోతే… ఇకపై తనను సినిమా ప్రమోషన్స్‌లో చూడరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో మరి విశ్వక్‌సేన్ ప్రచారానికి వస్తాడా అనే ప్రశ్న వినిపిస్తోంది.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!