Aaradugula Bullet Movie: ‘పక్కా కమర్షియల్’పై ‘బుల్లెట్’ ఎఫెక్ట్ పడుతుందా..?

గోపీచంద్-నయనతార జంటగా నటించిన సినిమా ‘ఆరడుగుల బుల్లెట్’. దర్శకుడు బి.గోపాల్ రూపొందించిన ఈ సినిమా ఎప్పుడో నాలుగేళ్ల క్రితం విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వలన సినిమా వాయిదా పడింది. ఓసారైతే మరో గంటలో సినిమా రిలీజ్ అనగా.. ఆగిపోయింది. మళ్లీ ఇప్పటివరకు ఈ సినిమా పత్తా లేకుండా పోయింది. ఆ తరువాత సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని అన్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఈ సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

త్వరలోనే విడుదల చేయబోతున్నామంటూ అనౌన్స్ చేశారు మేకర్లు. ఈసారైనా సినిమా రిలీజ్ అవుతుందో లేదో కానీ.. ఈ సినిమా ప్రకటన మాత్రం అటు గోపీచంద్ కీ.. ఇటు మారుతికి కొత్త టెన్షన్ ను తీసుకొచ్చింది. నిజానికి ఈ సినిమా స్టేల్ అయిపోయిన ప్రాజెక్ట్. ఇప్పుడు విడుదలైనా దీనిపై ఎలాంటి క్రేజ్ ఉండదు. ఈ సినిమా ఎఫెక్ట్ మారుతీ-గోపీచంద్ ల ప్రాజెక్ట్ ‘పక్కా కమర్షియల్’ పై పడుతుందేమోనని మారుతి భయపడుతున్నాడు. కానీ ఇప్పుడు ‘ఆరడుగుల బుల్లెట్’ విడుదలను ఆపే హక్కు మారుతి బ్యాచ్ కు లేదు.

కానీ విడుదలైతే మాత్రం కచ్చితంగా తదుపరి సినిమాపై ఆ ప్రభావం ఉంటుంది. ఇన్నాళ్లుగా ల్యాబ్ లోనే ఉండిపోయిన ఈ సినిమాను ఎంతోకొంతకి అమ్మి వదిలించుకుందామనుకుంటున్నారు నిర్మాతలు. మరి థియేటర్లో రిలీజ్ చేస్తారో ఓటీటీలో వదులుతారో చూడాలి!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus