Vijay: వీరయ్య, వీరసింహాలకు వారసుడు పోటీ ఇస్తాడా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చాలామంది తమిళ హీరోలలా తెలుగులో క్రేజ్ ను పెంచుకోవాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదనే సంగతి తెలిసిందే. విజయ్ ప్రస్తుతం వారసుడు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ పై కాన్ఫిడెన్స్ తో ఉన్న దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల స్థాయిలోనే ఈ సినిమాకు కూడా థియేటర్లు దక్కుతున్నాయని సమాచారం అందుతోంది. అయితే సంక్రాంతి పండుగకు విడుదలైన డబ్బింగ్ సినిమాలలో మెజారిటీ డబ్బింగ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. విజయ్ నటించిన మాస్టర్ మినహా సంక్రాంతికి విడుదలైన డబ్బింగ్ సినిమాలేవీ ఈ మధ్య కాలంలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. మాస్టర్ సినిమా కూడా మరీ బ్లాక్ బస్టర్ హిట్టేం కాదు. వారసుడు సినిమాతో ఈ సెంటిమెంట్ ను విజయ్ పూర్తి స్థాయిలో బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వారసుడు సినిమాతో విజయ్ నిజంగానే ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తారేమో చూడాల్సి ఉంది. సినిమాల ఫలితాల విషయంలో మెజారిటీ సందర్భాల్లో దిల్ రాజు అంచనాలు తప్పవు. పెద్ద సినిమాల రిజల్ట్ విషయంలో దిల్ రాజు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. పెద్ద హీరోల సినిమాలకు పోటీగా సంక్రాంతికి దిల్ రాజు సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే

వారసుడు సినిమాలో ఏదైనా ప్రత్యేకత ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేసి సక్సెస్ లను అందుకున్న దిల్ రాజు ఈసారి కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus