టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నానని శృతి హాసన్ ఇప్పటికే వెల్లడించారు.
అయితే శృతి హాసన్ కొన్నేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా రామయ్యా వస్తావయ్యా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. రొటీన్ కథ, కథనంతో తెరకెక్కడం కూడా ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఒక విధంగా కారణమైందని సమాచారం అందుతోంది. అయితే తారక్ సినిమాతో శృతికి ఫ్లాప్ రాగా బాలయ్య సినిమాతో శృతికి హిట్టొస్తుందేమో చూడాలి.
గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి. అందువల్ల ఈ సినిమా కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఫ్లాప్ సెంటిమెంట్ ను శృతి బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సినిమాసినిమాకు శృతిహాసన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. శృతి ఈ సినిమాతో పాటు సలార్ సినిమాలో, చిరంజీవి 154వ సినిమాలో నటిస్తున్నారు. సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా శృతి హాసన్ నిలుస్తున్నారు.
శృతి హాసన్ కు క్రేజ్ ఉండటంతో దర్శకనిర్మాతలు సైతం ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. శృతి హాసన్ ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!