Jr NTR: ఫ్లాప్ ఇచ్చిన దర్శకులను తారక్ నమ్ముతారా?

  • June 1, 2022 / 02:56 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది స్టార్ డైరెక్టర్లు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చినా ఆ ఛాన్స్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ తో కొంతమంది స్టార్ డైరెక్టర్లు తెరకెక్కించిన సినిమాలు ఫ్యాన్స్ కు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలయ్యాయి. అయితే ఈ డైరెక్టర్లు తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకున్నారు. ఈ దర్శకులకు తారక్ మళ్లీ ఛాన్స్ ఇస్తారా అని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి సినీ కెరీర్ లో అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, ధృవలాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే తారక్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన అశోక్, ఊసరవెల్లి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయనే చెప్పాలి. అయితే తారక్ సురేందర్ రెడ్డి కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. సింహా సక్సెస్ తర్వాత బోయపాటి శ్రీను జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమాను తెరకెక్కించారు.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా సెకండాఫ్ లో చేసిన పొరపాట్లు, సరైన హీరోయిన్లను ఎంచుకోకపోవడంతో దమ్ము ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. బాబాయ్ బాలకృష్ణకు హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను అబ్బాయికి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు. అయితే దమ్ము సక్సెస్ కాకపోయినా ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరో దర్శకుడు హరీష్ శంకర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన రామయ్య వస్తావయ్యా రొటీన్ కథ, కథనం వల్ల ఫ్లాపైంది. మొదట హరీష్ శంకర్ తయారు చేసిన స్క్రిప్ట్ ను కొన్ని కారణాల వల్ల మార్చడంతో ఈ సినిమా ఫ్లాపైంది. అయితే హరీష్ తారక్ తో మరో సినిమా తెరకెక్కించి సక్సెస్ సాధించాలని భావిస్తున్నారు. ఈ ముగ్గురు డైరెక్టర్లకు తారక్ మళ్లీ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus