Kajal, Balakrishna: ఆ సెంటిమెంట్ కు కాజల్ అగర్వాల్ సులువుగానే బ్రేకులు వేస్తారా?

  • May 27, 2024 / 06:35 PM IST

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో బాలయ్యకు జోడీగా నటించిన హీరోయిన్లకు తర్వాత రోజుల్లో కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదని ఆఫర్లు వచ్చినా భారీ విజయాలు దక్కడం లేదని కొన్నిసార్లు విజయాలు దక్కినా ఫుల్ లెంగ్త్ రోల్స్ అయితే లభించడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) , హనీరోజ్ (Honey Rose) , అఖండ (Akhanda) సినిమాకు ముందు బాలయ్యకు (Nandamuri Balakrishna) జోడీగా నటించిన హీరోయిన్ల గురించి ప్రస్తావిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వీరసింహారెడ్డి (Veera Simha Reddy) , వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాలతో శృతి హాసన్ (Shruti Haasan) హిట్లు సాధించినా సలార్ లో (Salaar) ఆమె రోల్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. శృతి హాసన్ ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ఎక్కువగా ప్రకటించడం లేదనే సంగతి తెలిసిందే. అయితే సత్యభామ సినిమాతో కాజల్ అగర్వాల్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది.

సత్యభామ (Satyabhama) సినిమాలో కాజల్ (Kajal Aggarwal) రోల్ మెయిన్ రోల్ కావడంతో బాలయ్య నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం కాజల్ కు సాధ్యమేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సత్యభామ తర్వాత వరుస సినిమాలతో కాజల్ బిజీ అవుతారా అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. సత్యభామ మూవీ ఈవెంట్ కు బాలయ్య రావడంతో ఇప్పటికే ఈ సినిమాపై ఒకింత అంచనాలు పెరిగాయి.

సత్యభామ మూవీ ట్రైలర్ కు యూట్యూబ్ లో 1.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. గూఢఛారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందజేయడంతో ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే సత్యభామ సినిమా కాజల్ కెరీర్ కు కీలకం అని చెప్పాలి. ఈ సినిమాలో కాజల్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. సత్యభామ మూవీ విషయంలో కాజల్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus