Koratala Siva: దేవర ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటున్న కొరటాల.. మోత మోగాల్సిందే!

కోలీవుడ్ ఇండస్ట్రీలోని పాపులర్ డైరెక్టర్లలో నెల్సన్ దిలీప్ కుమార్ ఒకరు కాగా ఈ దర్శకునికి ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. అయితే బీస్ట్ సినిమా ఫెయిల్యూర్ తో నెల్సన్ దిలీప్ కుమార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. బీస్ట్ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో నెల్సన్ ఫెయిల్ అయ్యారు. అయితే బీస్ట్ ఫ్లాప్ అయినా జైలర్ సినిమాతో నెల్సన్ ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. జైలర్ సినిమాకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నెల్సన్ తో తర్వాత ప్రాజెక్ట్ ల కోసం పని చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు. ఎంతో ప్రతిభ ఉన్న నెల్సన్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నెల్సన్ కెరీర్ లో బీస్ట్ ఏ విధంగా ఫ్లాప్ అయిందో కొరటాల శివ కెరీర్ లో ఆచార్య సినిమా కూడా అదే విధంగా ఫ్లాప్ అయింది. అయితే నెల్సన్ కు జైలర్ లా కొరటాల శివ కు దేవర ఉండబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. (Koratala Siva) కొరటాల శివ దేవర సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించడంతో పాటు తనపై విమర్శలు చేసిన వాళ్లకు సరైన విధంగా సమాధానం చెబుతారని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవర సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ సైతం కొత్తగా ఉండనుంది.

ఇప్పటికే విడుదలైన దేవర పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా దేవర సినిమా విడుదలైన తర్వాత ఏ రేంజ్ రికార్డులు సాధిస్తుందో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కచ్చితంగా హిట్టయ్యే సినిమాల్లో మాత్రమే నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus