మహేష్.. మాట నిలబెట్టుకుంటాడా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయ్యింది. అయితే ఇప్పుడు వైరస్ మహమ్మారి కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్ర చెయ్యాల్సి ఉంది. కానీ అతనికి కుదురుతుందో లేదో అని మహేష్ బాబుతో ఆ పాత్రని చేయించాలనుకున్నాడు దర్శకుడు కొరటాల శివ అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ‘ఈ ప్రచారంలో నిజం లేదని.. నేను టెన్షన్ పడుతుంటే చూడలేక ‘నేనున్నాను’ అని మాత్రమే మహేష్ అన్నాడని’ కొరటాల శివ చెప్పుకొచ్చాడు. తరువాత చరణ్ తోనే ఆ పాత్రను చేయించాలి అని చిరు డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మారిపోయింది. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పార్ట్ చాలా వరకూ ఆగిపోయింది. దాంతో చరణ్.. ఆచార్యలో నటించే అవకాశం లేదు. అందుకే మళ్ళీ మహేష్ ను ఒప్పించే పనిలో పడ్డారట చిరు, కొరటాల..! మహేష్ తన తరువాతి సినిమాని పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో చెయ్యబోతున్నాడు. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. సెప్టెంబర్ నుండీ ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలి అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మహేష్… ‘ఆచార్య’ చిత్రంలో నటించే అవకాశం లేదనేది ఇన్సైడ్ టాక్. మరోపక్క ‘ఆర్.ఆర్.ఆర్’ దర్శకుడు రాజమౌళి అలాగే ఆ చిత్రం నిర్మాత దానయ్య కూడా కరోనా భారిన పడ్డారు కాబట్టి.. మరో 4నెలల పాటు షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదని టాక్. ‘కాబట్టి సెప్టెంబర్ నుండీ ‘ఆచార్య’ షూటింగ్ మొదలు పెట్టి.. ముందుగా చరణ్ తోనే ఆ పాత్రను పూర్తి చేస్తే బెటర్’ అని ఇండస్ట్రీలో కొందరి అభిప్రాయం. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus