Mahesh Babu: ఆ దర్శకునికి మరో ఛాన్స్ ఇస్తున్న మహేష్!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య మూవీ త్వరలో రిలీజ్ కానుంది. మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు తెరకెక్కాయి. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాకు, రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ డైరెక్టర్లతో పాటు కొరటాల శివను కూడా మహేష్ బాబు లైన్ లో పెట్టారని తెలుస్తోంది. వరుసగా విజయాలను అందుకుంటున్న కొరటాల శివతో మహేష్ మరో సినిమాలో నటించడానికి ఆసక్తి చూపడంపై మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ మహేష్ బాబును కొత్తగా చూపించే డైరెక్టర్లలో ఒకరని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.

మరి కొందరు మహేష్ అభిమానులు మహేష్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహేష్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చిన తర్వాత మహేష్ రెమ్యునరేషన్ ను పెంచే ఛాన్స్ అయితే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మహేష్ బాబు మార్కెట్ ను పెంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సోషల్ మీడియాలో కూడా మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కరోనా నుంచి కోలుకున్న మహేష్ బాబు త్వరలో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ కాగా రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ హీరోగా తెరకెక్కే సినిమాకు హీరోయిన్ ఫిక్స్ కావాల్సి ఉంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus