నైట్ కర్ఫ్యూ… మళ్ళీ టాలీవుడ్ కు తిప్పలు తప్పేలా లేవు..!

  • January 5, 2022 / 02:45 PM IST

2022 సంక్రాంతికి భారీ స్థాయిలో ప్లాన్ చేసింది టాలీవుడ్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 పెద్ద సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నట్టు అధికారిక ప్రకటనలు వచ్చాయి. జనవరి 7న ‘ఆర్.ఆర్.ఆర్’, జనవరి 12న ‘భీమ్లా నాయక్’, జనవరి 13న ‘సర్కారు వారి పాట’, జనవరి 14న ‘రాధే శ్యామ్’, జనవరి 15న ‘బంగార్రాజు’. వీటిలో ‘ఆర్.ఆర్.ఆర్’ రాకతో ‘సర్కారు వారి పాట’ వెనక్కి తగ్గింది. సో పోటీ అంతా ‘ఆర్.ఆర్.ఆర్’, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ల మధ్యలోనే అని అంతా ఫిక్స్ అయ్యారు.

‘బంగార్రాజు’ ఈ పెద్ద సినిమాలకి పోటీ ఇచ్చే సినిమా కాకపోయినా వాటికి టికెట్లు దొరక్కపోతే మాత్రం ఈ సినిమా చూడొచ్చు అని జనాలు ప్లాన్ చేసుకున్నారు. కట్ చేస్తే కరోనా మరోసారి విజృంభించడంతో వీటి విడుదలకి మళ్ళీ అడ్డంకులు ఎదురయ్యాయి. ‘భీమ్లా నాయక్’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘రాధే శ్యామ్’ అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ‘బంగార్రాజు’ మాత్రం కచ్చితంగా వచ్చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో పాటు మరో 10 సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి.

2022 పెద్ద సినిమాల విడుదలతో టాలీవుడ్ కు పూర్వ వైభవం వస్తుంది అనుకుంటే.. చిన్న సినిమాలతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇదే పెద్ద డిజప్పాయింట్మెంట్ అనుకుంటే.. ఇప్పుడు అసలు సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతాయా అనే ప్రశ్న ఎదురవుతుంది? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీంతో నైట్ కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కరోనా ఉద్ధృతి ఇంకా పెరిగితే థియేటర్లను మూసెయ్యాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. జనాలు సంక్రాంతికే సినిమాలు ఎక్కువగా చూస్తారు అన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రభుత్వం థియేటర్లనే ముందుగా టార్గెట్ చేస్తుందని తెలుస్తుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus