సినిమాల్లో తామేంటో నిరూపించుకున్న స్టార్ హీరోస్… ఓటీటీవైపు కూడా చూస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కువగా బాలీవుడ్‌లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఓటీటీకి పెరుగుతున్న ఆదరణ చూసి… మన దగ్గర కూడా హీరోలు వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్స్ అంటూ ఓటీటీవైపు వస్తున్నారు. అలా నాగచైతన్య కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అధికారికరంగా ప్రకటించకపోయినా… పనులు అయితే వేగంగా సాగిపోతున్నాయట.
నాగచైతన్య– విక్రమ్ కుమార్ ప్రస్తుతం ‘థ్యాంక్‌యూ’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అది అవ్వగానే వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తారట. దీని గురించి విషయం బయటికొచ్చిన తొలినాళ్లలో ఇదో హారర్ అని, థ్రిల్లర్ అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. అదే ఈ సిరీస్ టైమ్ ట్రావెలర్ స్టోరీ అని తెలుస్తోంది. అంతే కాదు మూడు సిరీస్‌లుగా దీన్ని రూపొందిస్తారు అని కూడా అంటున్నారు.
నిజానికి మన దగ్గర టైమ్ ట్రావెల్ కథలకు మంచి గిరాకీ ఉంటుంది. అందులోనూ ఓటీటీ అంటే ఇంకానూ. అమెజాన్ ప్రైమ్‌లో టెలీకాస్ట్ అవుతుంది అంటున్న విక్రమ్ కుమార్ వెబ్ సిరీస్‌లో నాగచైతన్య ఓ జర్నలిస్ట్‌గా కనిపిస్తాడట. ఓ వార్త విషయంలో పరిశోధన చేస్తున్న సమయంలో అతను ఎదుర్కొన్న అంశాల ఆధారంగా ఈ వెబ్‌సిరీస్ తీస్తున్నారట. ఒక్కో సీజన్‌లో సుమారు పది ఎపిసోడ్‌లు ఉంటాయని టాక్. అయితే చైతు పాత్రలో కాస్త నెగిటివ్ టచ్ కూడా ఉంటుందని టాక్.
దీని కోసం చైతన్య మేకోవర్ కూడా ట్రై చేస్తున్నాడని చెబుతున్నారు. వినడానికి ఇదంతా ఆసక్తికరంగా ఉండొచ్చు కానీ… గతంలో చై ట్రై చేసిన ఇలాంటి డిఫరెంట్ స్క్రిప్ట్‌లు బోల్తా కొట్టాయి. పాత సినిమాల పేర్లెందుకు కానీ… అలా కొన్ని సినిమాలు ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు ఓటీటీ కోసం తొలిసారి సిరీస్ చేయడం… ఇలా ప్రయోగం అంటే… ఆలోచించాల్సిందే. మరి చైతు ఇవన్నీ చూసే చేస్తున్నాడా? లేదా అనేది తెలియాలి.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!