Dasara Movie: ‘దసరా’తో నాని క్రేజ్ మారిపోతుందా..?

  • February 28, 2023 / 10:11 AM IST

వేసవి సీజన్ లో ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. స్టూడెంట్స్ కి సెలవులు ఉంటాయి కాబట్టి థియేటర్లకు పెద్ద ఎత్తున జనం వస్తారు. ఆ సమయంలో సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తుంటాయి. అందుకే పెద్ద సినిమాలను వేసవిలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతి ఏడాది ఈ సీజన్ లో కనీసం రెండు, మూడు పెద్ద సినిమాలైనా రిలీజ్ అవుతుంటాయి. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’, ‘కేజీఎఫ్’, ‘ఆచార్య’ లాంటి పెద్ద సినిమాలు సమ్మర్ లో రిలీజ్ అయ్యాయి.

కానీ ఈసారి మాత్రం స్టార్ హీరోల సినిమాలేవీ కూడా వేసవికి రావడం లేదు. నిజానికి ఈ వేసవికి ‘సలార్’, ‘హరిహర వీరమల్లు’, ‘భోళా శంకర్’, మహేష్-త్రివిక్రమ్ సినిమాలు రిలీజ్ అవుతాయనుకున్నారు. కానీ ఇవన్నీ రకరకాల కారణాల వలన వాయిదా పడ్డాయి. దీంతో మిడ్ రేంజ్ హీరోల సినిమాలతోనే సరిపెట్టుకోక తప్పేలా లేదు. సమ్మర్ లో రాబోతున్న సినిమాల్లో కాస్త పెద్ద రేంజ్ కి వెళ్లగలిగే స్థాయి ఉన్న సినిమా అంటే ‘దసరా’ అనే చెప్పాలి.

నాని హీరోగా నటించిన ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ‘రావణాసుర’, ‘ఏజెంట్’, ‘శాకుంతలం’, ‘రామబాణం’, ‘విరూపాక్ష’ వంటి సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ వీటన్నింటినీ మించి నాని సినిమాకి మంచి బజ్ వస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ విడుదలయ్యాక హైప్ మరింత పెరిగింది. ఈ సినిమా నాని కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

ఇలాంటి మాస్ సినిమాలు క్లిక్ అయితే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తాయి. స్టార్ హీరోల సినిమాలు అందుబాటులో లేనప్పుడు ఉన్న సినిమాల్లో ఏది నచ్చితే దాన్ని పెద్ద రేంజ్ కి తీసుకెళ్తారు ప్రేక్షకులు. ‘దసరా’ సినిమాకి గనుక పాజిటివ్ టాక్ వస్తే.. వేసవిలో ఈ సినిమా అతి పెద్ద సక్సెస్ గా నిలవడం ఖాయం. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. మార్చి 30న పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus