Narappa: వెంకీ నారప్ప థియేటర్లలోనా..? ఓటీటీలోనా..?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారుల అంచనాలను మించి కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో దర్శకనిర్మాతలు థియేటర్లలో సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడి 100 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి వస్తే మాత్రమే పెద్ద సినిమాలను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ బాట పడుతున్నాయి.

స్టార్ యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించిన థ్యాంక్యూ బ్రదర్ సినిమా ఈ నెల 30న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆహా ఓటీటీలో ఈ సినిమా వచ్చే నెల 7వ తేదీన రిలీజ్ కానుంది. వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన నారప్ప సినిమా మే 14న రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ సినిమాను ఆరోజు థియేటర్లలో రిలీజ్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కొన్ని రోజుల క్రితం వెంకటేష్ నటించిన దృశ్యం2 సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని గాసిప్స్ గుప్పుమన్నాయి. కానీ సురేష్ బాబు మాత్రం దృశ్యం2 సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. అయితే అధికారక ప్రకటన వస్తే నారప్ప ఓటీటీలో రిలీజ్ అవుతుందో లేదో తేలే అవకాశం ఉంది. రెండుమూడు రోజుల్లో నారప్ప ఓటీటీ రిలీజ్ గురించి స్పష్టత రానుందని సమాచారం. ఓటీటీల నుంచి నారప్ప మూవీకి బాగానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

పెద్ద హీరోల సినిమాలు ఓటీటీలలో విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే ఆ ప్రభావం హీరోల కెరీర్ పై పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఓటీటీల నుంచి ఆఫర్లు వస్తున్నా నిర్మాతలు మాత్రం సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus