Pawan Kalyan: ఒకేసారి రెండు షూటింగ్‌లు.. సోషల్‌ మీడియాలో అప్‌డేట్లు.. ఏం జరుగుతోంది?

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) రెండు పడవల ప్రయాణంలో భాగంగా ఒకవైపు డిప్యూటీ సీఎంగా, మరోవైపు పవర్‌ స్టార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే.. సినిమాలకు డేట్స్‌ ఇచ్చారు. వీకెండ్స్‌లో, నైట్‌ షెడ్యూల్స్‌లో సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఒక సినిమా సెట్‌లో పవన్‌ ఉండగా.. మరో సెట్‌లో ఆయన లేని సీన్స్‌ తీస్తున్నారట. ఈ క్రమంలో విజయవాడ పరిసరాల్లో పవన్‌ సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయట. ఇలా విజయవాడ బిజీగా ఉంటే..

Pawan Kalyan

మరోవైపు సోషల్‌ మీడియా కూడా బిజీ అవుతోంది. ఓవైపు నుండి మెగా సూర్య ప్రొడక్షన్స్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తోంది. ఇటీవల షూటింగ్‌ మొదలైంది, పవర్‌స్టార్ట్‌ వచ్చారు అంటూ వాళ్లు చెబుతుంటే.. మరోవైపు ‘ఓజీ’ (OG Movie)   టీమ్‌ కూడా అదే పనిలో ఉంది. మొన్నీమధ్యనే సుజీత్‌ (Sujeeth)  .. తన టీమ్‌తో మాట్లాడుతున్న ఫొటోను షేర్‌ చేసి ‘ఓజీ’ పనులు షురూ అని టీజ్‌ చేసింది. ఆ వెంటనే తమన్‌తో దర్శకుడు సుజీత్‌ ఫొటోను షేర్‌ చేసింది.

అంటే ఈ రెండు సినిమాలు తమ ప్రోడక్ట్‌ను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే ‘ఓజీ’కి ముందు డేట్స్‌ ఇచ్చి ఆ సినిమా రిలీజ్‌ చేయిస్తారని అనుకున్నారు. ఈ మేరకు మార్చి నెలాఖరు అంటూ డేట్‌ కూడా ఇచ్చారు. కానీ అనూహ్యంగా పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’కి (Hari Hara Veera Mallu) డేట్స్‌ ఇచ్చారు. ఈ వారాంతంలో అధికారికంగా ‘ఓజీ’ సెట్స్‌కి వస్తారు అని చెబుతున్నారు. దీంతో రెండు టీమ్స్‌ తమ సినిమా సోషల్‌ మీడియా ప్రచారం చేస్తున్నాయి.

మరోవైపు సినిమాను అమ్ముకునే పనిలోనూ టీమ్స్‌ బిజీగా ఉన్నాయట. నిర్మాతల ఏఎం రత్నం (A. M. Rathnam ), డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఇదే పనిలో బిజీగా ఉన్నారట. ఓటీటీ డీల్స్‌ ఇప్పటికే ఫైనల్‌ కాగా.. మిగిలిన పనులు చూస్తున్నారట. దీంతో తొలుత వచ్చే సినిమా ఏది? అనే చర్చ విజయవాడ పరిసరాల్లో జరుగుతోంది. మరి పవన్‌ మనసులో ఏముందో? తెలియాల్సి ఉంది.

ముందే అనుమానించాల్సిందేమో.. లైఫ్‌లో స్పై గురించి సామ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus