పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో విజయాలను అందుకున్నారు. సినిమాసినిమాకు లుక్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మార్పు చూపిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. పవన్ అభిమానులు పవన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఇతర ప్రాజెక్ట్ లతో పోల్చి చూస్తే హరిహర వీరమల్లు సినిమాపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండటంతో పాటు క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి.
అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతుండటం గమనార్హం. ఇప్పటివరకు హరిహర వీరమల్లు షూటింగ్ కేవలం 50 శాతం మాత్రమే పూర్తైందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచాలని వేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే సమయంలో హరిహర వీరమల్లు సెట్స్, క్యాస్టూమ్స్ విషయంలో పవన్ అసంతృప్తిని వ్యక్తం చేశారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని పవన్ అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి వార్తల వల్ల సినిమాకు మైనస్ జరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఈ వార్తలపై స్పందించి ఈ రూమర్లకు చెక్ పెడితే బెటర్ అని పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ సినిమాలు ఆలస్యం కావడం వల్ల పవన్ తో సినిమాలు తీయాలని అనుకుంటున్న డైరెక్టర్ల తర్వాత సినిమాలు సైతం లేట్ అవుతున్నాయి.
పవన్ హీరోగా సముద్రఖని డైరెక్షన్ లో వినోదాయ సిత్తం రీమేక్ తెరకెక్కనుండగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ తెరకెక్కనుంది. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తైతే మాత్రమే పవన్ తర్వాత సినిమాల షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. పవన్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుండగా వచ్చే ఏడాది పవన్ నటించిన మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు ఈ ఏడాది రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం.