Prabhas: స్టార్ హీరో ప్రభాస్ అభిమానుల రిక్వెస్ట్ ను పట్టించుకుంటారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్  (Prabhas) వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సలార్ (Salaar) , కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD) సినిమాలు విజయం సాధించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. అయితే ప్రభాస్ భవిష్యత్ ప్రాజెక్ట్ లకు సంబంధించి ఒకింత కన్ఫ్యూజన్ మాత్రం కొనసాగుతోంది. సలార్2, స్పిరిట్ (Spirit) , ఫౌజీ(వర్కింగ్ టైటిల్), కల్కి2 సినిమాలలో ప్రభాస్ మొదట ఏ సినిమాను మొదలుపెడతారనే చర్చ ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలలో మొదట ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబో మూవీ మొదట మొదలుకానుంది. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ నే ఫైనల్ చేయొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా ప్రభాస్ కు 25వ సినిమా కావడం గమనార్హం. అయితే ప్రభాస్ 25వ సినిమాగా సలార్2 లేదా స్పిరిట్ విడుదలైతే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.

సలార్2, స్పిరిట్ మాస్ అప్పీల్ ఉన్న సినిమాలు కావడంతో ఈ సినిమాలలో ఏదో ఒక సినిమా ప్రభాస్ 25వ సినిమాగా విడుదలైతే తాము మరింత సంతోషిస్తామని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే సినిమాలకు సంబంధించి ప్రభాస్ మనస్సులో ఏముందనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకాల్సి ఉంది. ప్రభాస్ వరుస విజయాలు సాధిస్తే మాత్రం ఫ్యాన్స్ మరింత సంతోషిస్తారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

త్వరలో ప్రభాస్ ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మారుతి (Maruthi Dasari) ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను కచ్చితంగా అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా పోటీ లేకుండా ఈ సినిమా విడుదలవుతూ ఉండటంతో ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus