Prabhas: ప్రభాస్‌ సినిమా విషయంలో అగ్ర నిర్మాత వెనకడుగు..!

ప్రభాస్‌తో సినిమా అంటే.. ప్రభాస్‌ డేట్లు ఇస్తున్నాడు అంటే.. ఎగిరి గంతేసే నిర్మాతలు ఉన్నారు. బాలీవుడ్‌ నిర్మాతలు సైతం ప్రభాస్‌తో సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశాన్ని ఓ నిర్మాత వద్దనుకుంటున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. కొన్నేళ్ల క్రితం సినిమా కోసం అడ్వాన్స్‌ ఇచ్చిన నిర్మాత.. ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కిచ్చేస్తే చాలు సినిమా చేయకపోయినా ఫర్వాలేదు అనుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది.

ప్రభాస్‌ – మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందనే విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఈ సినిమా గురించి వరుసగా పుకార్లు వచ్చాయి. అయితే ఎక్కడా కన్‌ఫామ్‌ చేయలేదు, కాలేదు. కథ రెడీ అవుతోందని, హీరోయిన్లు వీళ్లే అని, సినిమా కోసం సెట్స్‌ కూడా వేసేశారని ఇలా చాలా రకాలు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ సినిమా గురించి ఈ ‘నిర్మాత మార్పు’ పుకార్లు వస్తున్నాయి. ఈ సినిమాను నిర్మిస్తారని అనుకున్న డీవీవీ దానయ్య ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారట.

ప్రభాస్‌తో సినిమా చేయాలని దానయ్య కొన్నేళ్ల క్రితం రూ. 50 కోట్లు ఇచ్చారని ఆ మధ్య వార్తలొచ్చాయి. దానికి తగ్గట్టే మారుతి టీమ్‌ సినిమా కోసం పని చేస్తుందని వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా ఎప్పటికి మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేకపోయేసరికి దానయ్య వెనక్కి వెళ్లిపోతున్నారట. ఎవరైనా నిర్మాత ముందుకొస్తే ఆ డబ్బులు తీసుకొని ప్రభాస్‌ డేట్స్‌ను ఇచ్చేయడానికి ఫిక్స్ అయ్యారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ప్రభాస్‌ కోసం రూ. 50 కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొస్తారు. అయితే ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు ఉన్న సినిమాలు, కొత్త సినిమా మొదలవ్వడానికి అడ్డంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ముందుకొస్తారో చూడాలి. యూవీ క్రియేషన్స్‌, మరో నిర్మాణ సంస్థ కలసి డీవీవీ దానయ్య నుండి ప్రభాస్‌ డేట్స్‌ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయమ్మీద క్లారిటీ వస్తుందంటున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus