Dil Raju, Naga Chaitanya: ఆ మాటను దిల్ రాజు నిలబెట్టుకుంటారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత దిల్ రాజుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దిల్ రాజుకు సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ ఉంటే ఆ సినిమా దాదాపుగా ఫ్లాప్ కాదని చాలామంది అభిమానులు భావిస్తారు. తక్కువ సమయంలోనే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లతో దిల్ రాజు నిర్మాతగా తన రేంజ్ ను పెంచుకున్నారు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు ఈ సినిమాలు కూడా విజయాలను అందుకుంటే నిర్మాతగా తన రేంజ్ ను మరింత పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

అయితే నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాతగా వాసువర్మ డైరెక్షన్ లో జోష్ తెరకెక్కగా ఆ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. దిల్ రాజును నమ్మి నాగార్జున ఛాన్స్ ఇవ్వగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అస్సలు అందుకోలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో విడుదల కావడం కూడా ఈ సినిమాపై ఒకింత నెగిటివ్ ఎఫెక్ట్ ను చూపింది. ఆ తర్వాత నాగచైతన్య దిల్ రాజు కాంబోలో సినిమా రాలేదు.

ప్రస్తుతం చైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాతగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన థాంక్యూ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థాంక్యూ సినిమాతో నాగచైతన్యకు హిట్ ఇవ్వాలన్న లోటును దిల్ రాజు భర్తీ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. నాగచైతన్యకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని చెప్పిన మాటను దిల్ రాజు నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

భారీ బడ్జెట్ తోనే దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ప్రేమమ్ పోలికలు కనిపిస్తున్నా కొత్త కథాంశంతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. విక్రమ్ కె కుమార్ కు సైతం ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. చైతన్య మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus