Eagle: పండగ నుండి ‘ఈగల్‌’ను పంపేశారు… మరి ఆ రోజు మాట నిలుస్తుందా?

ఈ ఏడాది సంక్రాంతి రేసులో ఉన్న సినిమా లిస్ట్‌ ఏంటి? ఎవరు ముందు అనౌన్స్‌ చేశారు? ఎవరు రెడీగా ఉన్నారు? ఈ లిస్ట్‌ తీస్తే తొలి స్థానాల్లో నిలిచిన సినిమాల్లో ‘ఈగల్‌’ ఒకటి. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు ఎప్పుడో సిద్ధమైంది. సినిమా ప్రచారం కూడా షురూ చేశారు. బహిరంగ సభలు కూడా పెట్టారు. అయితే అనూహ్యంగా సినిమాను పొంగల్‌ ఫైట్‌ నుండి తప్పించారు. అయితే సోలో రిలీజ్‌ ఇస్తామని నిర్మాతల తరఫున మాట కూడా ఇచ్చారు. మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా?

కావాలంటే మీరే చూడండి ‘ఈగల్‌’ సినిమాకు ఇచ్చిన ఫిబ్రవరి 9 డేట్‌న మరో మూడు సినిమాలు బరిలో ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ క్రేజీ మూవీ ‘టిల్లు స్క్వేర్‌’ అదే డేట్‌ను ఇప్పటికే చెప్పింది. ఆ తర్వాత సందీప్‌ కిషన్‌ ‘ఊరి పేరు భైరవకోన’ కూడా ఫిబ్రవరి రెండో వారాన్నే టార్గెట్‌ చేసింది. తాజాగా మహి వి రాఘవ్‌ – జీవా ‘యాత్ర 2’ కూడా అప్పుడే తీసుకొస్తాం అంటున్నారు. దీంతో మరి అప్పుడు దిల్ రాజు చెప్పిన ‘సోలో రిలీజ్‌’ ఎలా అవుతుంది అనేదే ప్రశ్న.

పైన చెప్పిన వాటిల్లో ‘టిల్లు స్క్వేర్‌’ డేట్ మార్పు తథ్యం అని అంటున్నారు. అయితే కొత్త డేట్‌ ఇంకా ఏమీ చెప్పలేదు. ఇక ‘ఊరి పేరు భైరవకోన’ చాలా నెలలుగా వాయిదా పడుతూ ఫిబ్రవరికి వచ్చింది. కానీ ‘యాత్ర 2’ మాత్రం ఆ రోజు రిలీజ్‌ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ వచ్చేస్తుంది. అదొచ్చాక సినిమా విడుదలకు అవకాశం ఉండదు. కాబట్టి ఫిబ్రవరి 9న సోలో రిలీజ్‌ కష్టం అంటున్నారు.

మరి ‘ఈగల్‌’ను స్పెషల్ సీజన్‌ నుంచి తప్పించి సోలో రిలీజ్‌ ఏర్పాటు చేయకపోతే ఇబ్బందే. మరి ఈ విషయాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఎలా డీల్‌ చేస్తారు. ఈ సినిమాకు నిర్మాతల పెద్ద దిల్‌ రాజు ఎలా న్యాయం చేస్తారో చూడాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus