జవాన్ బుక్ మై షో రికార్డ్ ను పుష్ప2 మూవీ బ్రేక్ చేయగలదా?

పుష్ప ది రూల్ మూవీ ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే జవాన్ మూవీ సాధించిన రికార్డ్ ను పుష్ప2 మూవీ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బుక్ మై షో ప్రస్తుతం ఒక సినిమాకు గంటలో ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయనే విషయాలను సైతం తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది.

అయితే బుక్ మై షో రికార్డులలో జవాన్ మూవీ తొలి స్థానంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఒకానొక సమయంలో గంటకు ఏకంగా 86 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. యానిమల్ సినిమా విషయానికి వస్తే గంటకు ఏకంగా 84 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే ఈ రికార్డులను ఏ సినిమా బ్రేక్ చేయలేదు. ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే సత్తా ఉన్న మూవీ పుష్ప ది రూల్ అని చాలామంది భావిస్తున్నారు.

పుష్ప2 మూవీ బడ్జెట్ విషయంలో సైతం మేకర్స్ ఏ మాత్రం రాజీ పడటం లేదని సమాచారం అందుతోంది. పుష్ప2 మూవీకి బిజినెస్ ఒకింత భారీ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో సైతం ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

పుష్ప ది రూల్ (Pushpa2) మూవీ విషయంలో బన్నీ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పుష్ప ది రూల్ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండబోతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమా కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus