Rajamouli: ఆ విమర్శలకు జక్కన్న చెక్ పెడతారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో చాలామంది అభిమానులు ఉన్నారు. రాజమౌళి సినిమాల విషయంలో కొన్నిసార్లు విమర్శలు వ్యక్తమైనా కమర్షియల్ గా ఈ సినిమాలు సక్సెస్ సాధించాయి. సుకుమార్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకుంటే రాజమౌళి దగ్గర పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లు మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం లేదు. రాజమౌళి దగ్గర పని చేసిన మహదేవ్ బాలయ్యతో మిత్రుడు అనే సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ అయింది. రాజమౌళి దగ్గర పని చేసిన పళని నాగ్ అన్వేష్ హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా కొన్నేళ్ల క్రితం ఏంజిల్ అనే సినిమాను తెరకెక్కించారు. ఫాంటసీ కథాంశంతో గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమా ప్రేక్షకులను అకట్టుకోలేదు. రాజమౌళి దగ్గర పని చేసిన త్రికోటి అనే వ్యక్తి దిక్కులు చూడకు రామయ్యా అనే సినిమాను తెరకెక్కించారు.

కథ, కథనం బాగానే ఉన్నా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. రాజమౌళి దగ్గర పని చేసిన కన్నన్ అనే డైరెక్టర్ సారాయి వీర్రాజు అనే సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. రాజమౌళి దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. రాజమౌళి దగ్గర ఆర్ఆర్ఆర్ సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు అయినా సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

రాజమౌళి తన దగ్గర పని చేసిన వాళ్ల విషయంలో సుకుమార్ లా శ్రద్ధ పెడితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 7వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమాపై ఊహించని స్థాయిలో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమాలో హీరోలుగా నటించారు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus