నవంబర్‌లో ‘SSMB29’ గ్లింప్స్ రాబోతోంది అని జక్కన్న అండ్ టీం ముందుగానే ప్రకటించారు. నవంబరు 11 లేదా 15 తేదీల్లో గ్లిమ్ప్స్ వస్తుంది అనే అంచనా ఉంది. అలాగే పాన్ ఇండియా మీడియాతో కలిసి ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించేందుకు కూడా రెడీ అయ్యారు అనే టాక్ కూడా నడుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఉన్న మీడియాతో రాజమౌళి, మహేష్ ముచ్చటించే అవకాశం ఉంది. ఈ గ్లింప్స్ కి వచ్చేసరికి ఎడిటింగ్, ఆర్.ఆర్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ గ్లింప్స్ లో రాజమౌళి మహేష్ బాబుని ఏ రేంజ్లో చూపిస్తారు? సినిమాకి టైటిల్ ఏం ఫిక్స్ చేశారు? అనేది ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు కథ విషయంలో రాజమౌళికి ముసుకులో గుద్దులాట అనేది ఉండదు. స్టోరీ లైన్ ఏంటి అనేది ముందుగానే చెప్పేస్తారు. ‘యమదొంగ’ నుండి చూసుకుంటే రాజమౌళి తన ప్రతి సినిమా కథని ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తుంటారు. ‘ఈగ’ టైంలో స్టోరీ లైన్ తో పాటు.. ఆ సినిమాలో హీరో నాని పాత్ర చనిపోతుందని, ఆ పాత్ర 20 నిమిషాలే ఉంటుందని కూడా చెప్పేశారు రాజమౌళి. కథ మొత్తం ముందుగానే చెప్పేసి ఆడియన్స్ ని ప్రిపేర్ చేసి ఉంచుతారు రాజమౌళి. ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో కూడా ఇదే చేశారు.
ఇప్పుడు ‘SSMB29’ విషయంలో కూడా రాజమౌళి ఇదే పద్ధతి ఫాలో అవుతారని అంతా భావిస్తున్నారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు స్టోరీ లైన్ ను రాజమౌళి ముందుగా చెప్పకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. SSMB29 పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఇప్పటివరకు బయటికి వదిలింది లేదు.అవే రివీల్ చేయనప్పుడు… కథ ఎలా రివీల్ చేస్తాడు? అనే డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.