మాస్ మహారాజ్ రవితేజకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రవితేజ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా గ్యారంటీగా సక్సెస్ సాధిస్తుందని ప్రేక్షకుల్లో అభిప్రాయం ఉండేది. రవితేజ సైతం ప్రేక్షకులను అలరించే కథ, కథనం ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే 2022 సంవత్సరం మాత్రం రవితేజకు కలిసిరాలేదు. ఈ ఏడాది రెండు సినిమాలు రవితేజకు భారీ షాకులిచ్చాయనే సంగతి తెలిసిందే. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో రవితేజ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
ఈ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో పాటు ఈ సినిమా నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చాయి. అయితే ఈ సినిమాలు రవితేజ మార్కెట్ పై కూడా ప్రభావం చూపాయి. ఖిలాడీ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తే ఇతర భాషల్లో ఆ సినిమా సక్సెస్ కాలేదు. రవితేజ ధమాకా సినిమాతో ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రవితేజ, శ్రీలీల జోడీపై ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
అయితే సినిమాలో ఈ జోడీ ఆకట్టుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. రవితేజ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం వల్ల కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ధమాకా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో రవితేజ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందో లేదో చూడాలి. రవితేజ పారితోషికం ప్రస్తుతం 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.
వరుస సక్సెస్ లు సాధిస్తే రవితేజ రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. రవితేజ కెరీర్ లో మరెన్నో సక్సెస్ లను అందుకుని నటుడిగా ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.