Revanth: రేవంత్ జెర్నీ అదుర్స్..! బిగ్ బాస్ మిస్ అయ్యింది ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ కి ఇది లాస్ట్ వీక్. ఈవారం ఫినాలేకి హౌస్ మేట్స్ అందరూ ముస్తాబవుతున్నారు. ప్రతి సీజన్ లో జరిగేలాగానే ఈ సీజన్ లో కూడా టాప్ – 5 మెంబర్స్ ఫినాలేకి రాబోతున్నారు. అయితే, ఇక్కడే బిగ్ బాస్ లాస్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో రేవంత్ ఎలిమినేట్ కాబోతున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కానీ, బిగ్ బాస్ టీమ్ మాత్రం రేవంత్ జెర్నీ హౌస్ లో చూస్తే, విన్నర్ అతడే అని డిక్లేర్ చేసేలాగానే కనిపిస్తున్నారు. ఎపిసోడ్ లో రేవంత్ జెర్నీ చూస్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా ఇంటి నుంచీ ఫస్ట్ ఫోన్ రాగానే తన భార్య అన్విత వాయిస్ విని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. మరోవారం మాత్రమే మిగిలి ఉందని, పాపకి గిఫ్ట్ గా ట్రోఫీతో తిరిగి రమ్మని చెప్పడంతో ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఆ తర్వాత రేవంత్ జెర్నీ చూస్తూ బాగా ఎక్సైట్ అయిపోయాడు.

చిన్నపిల్లాడిలా తన జెర్నీని చూసుకుంటూ మురిసిపోయాడు. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఇప్పటివరకూ తను ఆడిన టాస్క్ లు, చేసిన అల్లరి అంతా చూసుకున్నాడు. అయితే, నామినేషన్స్ అప్పుడు జరిగిన ఫైట్ మాత్రం మిస్ అయ్యింది. బిగ్ బాస్ కావాలనే కొన్ని రేవంత్ అన్న డైలాగ్స్ ని తీసేశారు. రేవంత్ కి మైనస్ అయినది ఏది కూడా జెర్నీలో చూపించలేదు. ఆ తర్వాత శ్రీసత్య విషయంలో కూడా ఇదే జరిగింది. శ్రీసత్య కీర్తి విషయాన్ని హైలెట్ చేశారు. అంతకుముందు శ్రీసత్య నామినేషన్స్ అప్పుడు మాట్లాడటం, వెటకారం చేయడం, యాటిట్యూడ్ చూపించడం ఇవన్నీ జెర్నీలో మిస్ అయ్యాయి.

రేవంత్ – శ్రీసత్య ఇద్దరి జెర్నీలతో ఎపిసోడ్ ముగిసిపోయింది. శ్రీసత్య – శ్రీహాన్ – రేవంత్ ముగ్గురు ఫ్రెండ్షిప్ ని బాగా చూపించాడు బిగ్ బాస్. రేవంత్, శ్రీసత్య ఇద్దరి జెర్నీలు చూసుకుని బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు, ఈసారి సీజన్ లోకి ఏకంగా 21మంది వచ్చారు. వాళ్లలో ఇప్పుడు కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. మరి వీళ్లలో రేవంత్ ప్రస్తుతానికి ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు కాబట్టి, రేవంత్ విన్నర్ అవుతాడనే అంటున్నారు బిగ్ బాస్ ప్రేమికులు. మొత్తానికి అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus