స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ప్రభాస్ నటించి ఈ నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజవుతున్న రాధేశ్యామ్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్ లో రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు సాధించడంతో పాటు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఓవర్సీస్ లో భారీగా కలెక్షన్లను సాధిస్తున్న విషయం తెలిసిందే.
సాధారణంగా మాస్ సినిమాలకు ఓవర్సీస్ లో భారీస్థాయిలో ఆదరణ దక్కదు. అయితే భీమ్లా నాయక్ సినిమా మాత్రం పవన్, రానాలకు ఉన్న క్రేజ్ వల్ల ఫుల్ రన్ లో రెండున్నర మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సోమవారం రోజున భీమ్లా నాయక్ ఓవర్సీస్ లో 40,000 డాలర్ల కలెక్షన్లను సాధించింది. ఓవర్సీస్ లో విడుదలైన సినిమాలలో చాలా ఎక్కువ సినిమాలు రిలీజైన తర్వాత తొలి సోమవారం రోజున 50,000 డాలర్ల కంటే తక్కువ కలెక్షన్లను సాధించాయి.
అయితే తొలి సోమవారం కలెక్షన్ల విషయంలో 2,54,000 డాలర్లతో ప్రభాస్ నటించిన సాహో తొలిస్థానంలో ఉంది. ఈ రికార్డును ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ లేదా చరణ్, తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేయవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ సాహో సినిమాతో క్రియేట్ చేసిన రికార్డ్ ఏ సినిమాతో బ్రేక్ అవుతుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాపై చరణ్, తారక్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు తమ హీరోల కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
ఆర్ఆర్ఆర్ తో చరణ్, తారక్ ఫ్యాన్స్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయనే సంగతి తెలిసిందే.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!