కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకొని మరణించగా…నిరసనలు సెగలు చల్లారేలా కనిపించడం లేదు. సుశాంత్ ని మానసికంగా వేధించి ఆత్మ హత్యకు బాలీవుడ్ పెద్దలు ప్రేరేపించారన్న వాదం గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే అనేక మంది నటులు, సాంకేతిక్ నిపుణులు, సింగర్స్ బాలీవుడ్ లో పాతుకుపోయిన నేపోటిజం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎటువంటి అండలేకుండా పరిశ్రమలో ఎదగాలనుకున్న వారికి ఎదురవుతున్న సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బీహార్ రాష్ట్రానికి చెందిన వాడు కావడంతో.. ఆయన మరణంపై బిహారీ వాదం కూడా పైకి లేచింది. ఆయన మరణానికి కారణమైన వారి సినిమాలు బిహార్ లో విడుదలకానీయం అని వారు అంటున్నారు. ఈ లిస్ట్ లో సల్మాన్, అలియా భట్ మరియు కరణ్ జోహార్ ఉన్నారు. మరి ఆర్ ఆర్ ఆర్ మూవీలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ మూవీని కూడా బీహారీలు అడ్డుకొనే అవకాశం లేకపోలేదు.
ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ హీరోయిన్ గా ఉన్న కారణంగా ఈ చిత్రాన్ని వాళ్ళు బ్యాన్ చేస్తే అది పెద్ద దెబ్బే అని చెప్పాలి. తెలుగు సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. రాజమౌళి బాహుబలి చిత్రాలతో పాటు, ప్రభాస్ గత చిత్రం సాహో బిహార్ లో విశేష ఆదరణ దక్కించుకున్నాయి. అలియా పై కోపంతో వారు ఆర్ ఆర్ ఆర్ సినిమాను అడ్డుకుంటే అది ఖచ్చితంగా వసూళ్లపై ప్రభావం చూపుతుంది. కాబట్టి అలియా రూపంలో ఆర్ ఆర్ ఆర్ కి మరో చిక్కొచ్చి పడింది అనిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలకు మరో ఏడాది సమయం ఉండగా బీహారీలు శాంతిస్తారేమో చూడాలి.