Sai Dharam Tej: సాయితేజ్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరనుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి నెలా రెండు నుంచి మూడు సినిమాలు సక్సెస్ సాధిస్తుండటంతో ఫ్యాన్స్ సైతం తెగ సంతోషిస్తున్నారు. విరూపాక్ష సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మధ్య కాలంలో సుకుమార్ శిష్యుల డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుల, సుకుమార్ లక్ సాయితేజ్ కు కలిసొస్తుందేమో చూడాలి.

సాయితేజ్ తొలిసారి హర్రర్ థ్రిల్లర్ లో నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయితేజ్ ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమాతో సాయితేజ్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయితేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.

సాయితేజ్ (Sai Dharam Tej) కు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. సాయితేజ్ వివాదాలకు దూరంగా ఉంటారు. విరూపాక్ష మూవీకి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. తారక్ వాయిస్ ఓవర్ ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సాయితేజ్ అడిగిన వెంటనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్టీఆర్ అంగీకరించారు. భవిష్యత్తులో సాయితేజ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. మెగా, నందమూరి కాంబినేషన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, సాయితేజ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus