Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ఆ సినిమాలతో సక్సెస్ సాధిస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి వరుసగా విజయాలను అందుకుంటున్నా పరిమితంగా సినిమాలలో నటించడం కొంతమంది ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. అయితే ఈ బ్యూటీ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం వేగం పెంచారు. ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న సాయిపల్లవి ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాలలో నటించడం గమనార్హం.
కథలు నచ్చకపోవడం వల్ల గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ కొన్ని స్టార్ హీరోల సినిమాలను సైతం రిజెక్ట్ చేశారు.

ప్రస్తుతం సాయిపల్లవి రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఒక సినిమాలో సాయిపల్లవి శివకార్తికేయన్ కు జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పాండిచ్చేరిలో జరుగుతోంది. సాయిపల్లవి రెమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఈ సినిమాలో సాయిపల్లవి బలమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు నాగచైతన్య సాయిపల్లవి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది.

లవ్ స్టోరీ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. సాయిపల్లవి ఈ రెండు సినిమాలతో మళ్లీ కెరీర్ పరంగా బిజీ అవుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ అభినయ ప్రధాన పాత్రల్లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

సాయిపల్లవి (Sai Pallavi) బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కీలక ప్రాజెక్ట్ లలో నటించనున్నారని తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బాలీవుడ్ లో కూడా ఈ హీరోయిన్ సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ టైర్1 హీరోలకు సాయిపల్లవి జోడీగా నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎన్టీఆర్, బన్నీలకు సాయిపల్లవి జోడీగా నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus