Salaar: సలార్ మూవీ ఆ భాషలో సైతం సంచలనాలు సృష్టించడం ఖాయమా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమాకు స్టడీగా కలెక్షన్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా 660 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 800 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఇతర భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.

సలార్2 మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతుందని మేకర్స్ ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సలార్ సినిమాను స్పానిష్ భాషలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫీలవుతున్నారు. మార్చి నెల 7వ తేదీన లాటిన్ అమెరికా దేశాలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. విదేశాల్లో సైతం సలార్ సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ సినిమాకు ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమాకు ప్లస్ అయ్యేది.

సలార్2 2025లో రిలీజ్ కానుందని మేకర్స్ నుంచి క్లారిటీ రాగా ఆ సమయానికి ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎనిమిది వారాల తర్వాతే సలార్ ఒటీటీలో రిలీజ్ అయ్యే ఛ్హాన్స్ ఉంది. ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమాను చూసిన వాళ్లు ఓటీటీ రిలీజ్ కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శృతిహాసన్ కెరీర్ కు సైతం ఈ సినిమా ప్లస్ అయింది.

సలార్1 300 కోట్ల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కగా సలార్2 మాత్రం 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని భోగట్టా. సలార్2 సినిమాలో ట్విస్టులు సైతం వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. సలార్2 మూవీ కమర్షియల్ గా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే సత్తా ఉన్న మూవీ ఇదేనని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus