సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా ‘శాకుంతలం’. ‘రుద్రమదేవి’ లాంటి హిట్ సినిమా తరువాత గుణశేఖర్ తీస్తున్న సినిమా ఇది. ‘రుద్రమదేవి’ వర్కవుట్ అయింది కాబట్టి మళ్లీ ఓ కథానాయికను పెట్టి తీసిన భారీ బడ్జెట్ సినిమా కూడా అలానే ప్రేక్షకులను మెప్పిస్తుందని గుణ ఆశించినట్లు ఉన్నారు. కానీ ‘శాకుంతలం’ ట్రైలర్ చూసిన తరువాత నిజంగా ఇదే వర్కవుట్ అయ్యే సినిమానేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ‘రుద్రమదేవి’ సినిమాలో ఉన్న భారీతనం,
హీరోయిన్ చేసే యాక్షన్ సన్నివేశాలు ఇందులో కనిపించవు. సమంతకు అనుష్క తరహా ఇమేజ్ లేదు. సినిమాలో సమంత క్యారెక్టర్ యోధురాలి క్యారెక్టర్ కాదు. కాబట్టి ‘రుద్రమదేవి’ మాదిరి మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే అంశాలు సినిమాలో లేవనే చెప్పాలి. ‘రుద్రమదేవి’ సినిమాలో రానా క్యారెక్టర్ ఉంటుంది. అది సినిమాకి ప్లస్ అయింది. కానీ ‘శాకుంతలం’లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని మలయాళ నటుడు దేవ్ మోహన్ ని తీసుకున్నారు.
అతడు సినిమాలో ఎన్ని యాక్షన్ సీన్స్ చేసినా.. దానికి మనవాళ్లు కనెక్ట్ అవ్వడం కష్టమే. ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ చేసిన స్పెషల్ క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలాంటి ఒక స్పెషల్ ఫ్యాక్టర్ ‘శాకుంతలం’ సినిమాలో కనిపించడం లేదు. కథ పరంగా విషయం ఉన్నప్పటికీ.. ట్రైలర్ చూసిన జనాలకు మాత్రం క్యూరియాసిటీ పెంచే అంశాలేవీ పెద్దగా కనిపించలేదు. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా.. నేచురల్ గా ఉన్నట్లు కనిపించలేదు.
సమంత తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం కూడా మైనస్ అయినట్లుంది. చిన్మయితో డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేది. ఈ సినిమా కోసం గుణశేఖర్ అండ్ టీమ్ బాగానే ఖర్చు పెట్టినప్పటికీ ‘శాకుంతలం’ సినిమా కమర్షియల్ గా ఎంతవరకు ఆడుతుందనే సందేహాలు కలుగుతున్నాయి.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!