Samyuktha Menon: బింబిసార 2′ లో అయినా సంయుక్త పాత్ర ఎక్కువగా ఉంటుందా..?

ఈ ఏడాది వచ్చిన ‘భీమ్లా నాయక్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది సంయుక్త మీనన్. మలయాళం నటి అయినప్పటికీ చాలా చక్కగా నటించింది. రానా సరసన ఆమె నటించింది. డానియల్ శేఖర్ భార్యగా, నిండు గర్భిణిగా ఆమె కనిపిస్తుంది. ఆ సినిమాలో ఆమె కనపరిచిన నటన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. క్లైమాక్స్ లో కథని మలుపు తిప్పి సినిమాకి హ్యాపీ ఎండింగ్ ను ఇచ్చేది ఈమె పాత్రే అని చెప్పాలి.

అంత డీ గ్లామరస్ పాత్రలో కూడా ఆమె చాలా చక్కగా కనిపించింది. ఈమె నటించిన మరో చిత్రం ‘బింబిసార’ కూడా ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో ఆమె వైజయంతి అనే పోలీస్ పాత్రని పోషించింది. టైం ట్రావెల్ చేసి వచ్చిన ‘బింబిసార’ కి సాయం చేసే అమ్మాయిగా, అలాగే అతని మనసు పారేసుకునే అమ్మాయిగా ఆమె నటించింది. ‘బింబిసార’ అనేది చాలా వెయిట్ ఉన్న పాత్ర కాబట్టి.. అన్ని పాత్రలు సగం సగం అన్నట్టే కనిపిస్తాయి. సంయుక్త పాత్రైతే మరీను.

సినిమా చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు.. ఈ సినిమా కోసం సంయుక్త కి సంబంధించి ఒక్కరోజు కాల్షీట్లే తీసుకున్నారా అంటూ సెటైర్లు వేశారు. అయితే ఆమె కనిపించేది కాసేపే అయినప్పటికీ, మోడ్రన్ లుక్ లో చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్రకి ఇంత తక్కువ రన్ టైం ఉండటం వెనుక కారణం ఏంటి అని చిత్ర బృందాన్ని ప్రశ్నించగా…. సెకండ్ పార్ట్ లో ఈమె పాత్ర నిడివి పెరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే దర్శకుడు, హీరో మాత్రం సెకండ్ పార్ట్ అంతా బింబిసారుడి బాల్యం నుండి చూపించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అప్పుడు మళ్ళీ హీరోయిన్ల పాత్రలకు అంత స్కోప్ ఉండదు. మరి చివరికి ఏం జరుగుతుందో సెకండ్ పార్ట్ వచ్చేవరకు వేచి చూడాలి..!

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus