సంక్రాంతి సినిమాల నిర్మాతలు ఇలా ప్లాన్ చేయగలరా?

  • November 23, 2022 / 07:58 PM IST

సంక్రాంతి పండుగ కానుకగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలకు థియేటర్లను కేటాయించడం డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు తలనొప్పిగా మారింది. ఒకటి రెండు రోజుల తేడాతో ఈ మూడు సినిమాలు విడుదలైతే మాత్రం ఏదో ఒక సినిమాకు భారీ మొత్తంలో నష్టాలు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి సినిమాల థియేట్రికల్ హక్కుల బిజినెస్ 350 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం.

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు దాదాపుగా సమాన స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. వారసుడు సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో ఆయన సినిమాల హక్కులను కొనుగోలు చేసే రెగ్యులర్ బయ్యర్లు ఈ సినిమాను తీసుకుంటున్నారు. ఏ సెంటర్లలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురవుతోంది. బీ, సీ సెంటర్లలో మాత్రం వారసుడు సినిమాకు థియేటర్ల సమస్య ఎదురవుతోంది. అయితే ఒక విధంగా చేస్తే సంక్రాంతి సినిమాలకు థియేటర్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

జనవరి ఫస్ట్ వీక్ లో ఒక సినిమాను విడుదల చేసి వారం రోజుల గ్యాప్ తో మరో సినిమాను విడుదల చేస్తే థియేటర్ల సమస్యకు చాలావరకు చెక్ పెట్టవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా థియేటర్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నిర్మాతలు ఈ విధంగా చేయడం ద్వారా అన్ని సినిమాలకు కలెక్షన్లు పెరుగుతాయి. టాలీవుడ్ నిర్మాతలు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.

సోలోగా విడుదలైన ఫస్ట్ సినిమాకు భారీ సంఖ్యలో థియేటర్లు దక్కే ఛాన్స్ తో పాటు టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్నా రికార్డులు క్రియేట్ అవుతాయి. సంక్రాంతి సమయానికి థియేటర్ల సమస్య పరిష్కారం అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus