కమెడియన్ గా సూపర్ ఫామ్ లో ఉన్న సప్తగిరి హీరోగా “సప్తగిరి ఎక్స్ ప్రెస్”తో సూపర్ హిట్ అందుకోవడం అందరికీ తెలిసిందే. అయితే.. కొందరు కామెడియన్స్ లాగ హీరో అయ్యాక కామెడీ రోల్స్ ను మానేయకుండా.. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ముందుకు వెళుతున్నాడు. అయితే.. మనోడి తాజా చిత్రం “సప్తగిరి ఎల్.ఎల్.బి” విషయంలో మాత్రం కాస్త రిస్క్ ఎక్కువ చేస్తున్నాడనిపిస్తుంది. “సప్తగిరి ఎక్స్ ప్రెస్” ప్రొడ్యూసరే ఈ తాజా చిత్రాన్ని కూడా నిర్మించడంతో.. మునుపటి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసినవారే ఈ సినిమా కూడా కొనాలని వచ్చారట. అయితే.. ప్రొడ్యూసర్ మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ ఎక్స్ పెక్ట్ చేయని ఎమౌంట్ చెప్పాడట.
హిందీలో సూపర్ హిట్ అయిన “జాలీ ఎల్.ఎల్.బి”కి రీమేక్ గా రూపొందిన “సప్తగిరి ఎక్స్ ప్రెస్” బడ్జెట్ అనుకొన్నదానికంటే ఎక్కువగా దాదాపు 6 కోట్లు అయ్యిందట. ఒక కమెడియన్ సినిమాకు ఈస్థాయిలో ఖర్చు చేయడం పట్ల డిస్ట్రిబ్యూటర్స్ కూడా షాక్ అయ్యారట. అయితే.. సినిమాకి కాస్త గట్టిగా ప్రమోషన్ చేస్తుండడం సప్తగిరి తన కాంటాక్ట్స్ ను గట్టిగా వాడి ట్రైలర్ ను రామ్ చరణ్ తో, సాంగ్స్ ను తాను పనిచేసిన దర్శకనిర్మాతల చేత విడుదల చేయిస్తూ బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాడు. హడావుడి బాగానే ఉన్నప్పటికీ.. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కేవలం సప్తగిరి మార్కెట్ ను బేస్ చేసుకొని 6 కోట్ల రూపాయలతో సినిమాని కోనాలంటే భయపడుతున్నారట. డిసెంబర్ 7న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని 6 కోట్లు పెట్టి కొంటే.. లాభాలు రావాలంటే కనీసం 8 కోట్లు కలెక్ట్ చేయాలి. డిసెంబర్ అనేది సినిమాలకు సరైన సీజన్ కాదు. మరి అలాంటప్పుడు సప్తగిరి నమ్ముకొని రిస్క్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తారా లేక నిర్మాత తానే స్వయంగా రంగంలోకి ఓన్ రిలీజ్ చేసుకొంటాడా అనేది చూడాలి.