Matka: ఈ సినిమాతో అయినా ఆ సీనియర్ హీరోయిన్ కి బ్రేక్ వస్తుందా?
- October 25, 2024 / 10:15 AM ISTByFilmy Focus
‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) తర్వాత ‘గని’ (Ghani) ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) వంటి 3 డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు వరుణ్ తేజ్(Varun Tej). దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘మట్కా’ (Matka) చేశాడు. ఇది ఒక పీరియాడిక్ మూవీ. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహించగా…మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్ గా నటించింది. నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఇటీవల టీజర్ ని వదిలారు. అది బాగానే ఉంది. వరుణ్ తేజ్ రీసెంట్ మూవీస్ తో పోలిస్తే చాలా బెటర్ గా, ప్రామిసింగ్ గా అనిపించింది.
Matka

వరుణ్ తేజ్ లుక్స్ కూడా బాగానే ఉన్నాయి. హీరో, డైరెక్టర్ కి మాత్రమే కాదు ‘మట్కా’ (Matka) సక్సెస్ మరొకరికి కూడా చాలా కీలకంగా మారింది. ఇలా అంటున్నాను కదా అని..అది హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి అనుకుంటారేమో. కానీ ఆమె కాదు. ఒకప్పటి హీరోయిన్ సలోని (Saloni Aswani) గురించి. అవును ‘మట్కా’ లో ఆమె ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఆమె పాత్రకి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా వదిలారు.

అందులో ఆమె చీర కట్టులో హుందాగా కనిపించింది. ఈ సినిమా సక్సెస్ అయితే మళ్ళీ ఆఫర్లు పట్టాలని ఆమె భావిస్తోందట. వాస్తవానికి ‘తంత్ర’ (Tantra) అనే సినిమాతో ఈ ఏడాది రీ ఎంట్రీ ఇచ్చింది సలోని. అందులో ఈమె పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. కానీ.. ఆమె రీ ఎంట్రీకి పనికొచ్చేలా సీన్లు డిజైన్ చేయలేదు. మరీ బి- గ్రేడ్ నటి తరహాలో సలోని పాత్రని డిజైన్ చేసి.. మిస్ లీడ్ చేశారు. మరి ‘మట్కా’ అయినా ఆమెకు కలిసొస్తుందేమో చూడాలి.












