కోలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు శక్తి సౌందర్ రాజన్. అతడి సినిమాలన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరి కాకుండా.. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్స్ టైపులో సినిమాలు తీస్తుంటారు. అప్పటివరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించని జాంబీ జానర్లో సినిమా తీసి చాలా ఏళ్ల క్రితమే అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ దర్శకుడు. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తరువాత స్పేస్ నేపథ్యంలో ‘టిక్ టిక్ టిక్’ అనే సినిమాను రూపొందించారు.
తెలుగులో వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ సినిమా రావడానికంటే ముందే ఇండియాలో తెరకెక్కిన తొలి ఫుల్ లెంగ్త్ స్పేస్ సినిమాగా ఇది రికార్డులకెక్కింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత ఆర్య హీరోగా శక్తి సౌందర్ రాజన్ ‘టెడ్డీ’ అనే సినిమాను రూపొందించారు. హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరోయిన్ ఆత్మ టెడ్డీలోకి ప్రవేశిస్తుంది. కానీ హీరోయిన్ మాత్రం కోమా స్టేజ్ లో ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నడిచే సినిమా ఇది.
ఇప్పుడు ఆర్య హీరోగా మరో సినిమా చేస్తున్నారు శక్తి సౌందర్ రాజన్. అదే ‘కెప్టెన్’. హాలీవుడ్ ‘ప్రిడేటర్’ సినిమాను తలపించేలా ఉంది ఈ సినిమా. ఇందులో హీరో ఆర్మీ ఆఫీసర్. ఎలాంటి మిషన్ కోసమైనా ముందుండే హీరో అడవిలో తిరిగే ఏలియన్ లాంటి ఒక వింత జీవిని పట్టుకోవడానికి రెడీ అవుతాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేదే సినిమా. ఈ సినిమా స్టోరీ, విజువల్స్ అన్నీ హాలీవుడ్ రేంజ్ లోనే ఉన్నాయి. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?