‘డిజె టిల్లు’ (DJ Tillu) ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సినిమాలతో సిద్ధు ఇమేజ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ‘టిల్లు స్క్వేర్’ సినిమా వంద కోట్ల పైనే వసూల్ చేసింది. అందువల్ల సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) మార్కెట్ కూడా పెరిగింది. ఇదిలా ఉంటే.. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఓటీటీలో రిలీజ్ అయిన టైంలోనే ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి సైన్ చేశాడు సిద్ధు. తర్వాత ‘డిజె టిల్లు’ ‘టిల్లు స్క్వేర్’ తో అతని మార్కెట్ భారీగా పెరిగింది.
దీంతో అతను పారితోషికం రెండింతలు డిమాండ్ చేశాడు. మొత్తంగా ‘జాక్’ (Jack) సినిమా కోసం రూ.12 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు సిద్ధు. బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇది దారుణంగా ప్లాప్ అయ్యింది. ఓపెనింగ్స్ కూడా రాలేదు. దీంతో ‘జాక్’ సినిమాతో బయ్యర్స్ భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కువ రెట్లు పెట్టి కొన్న బయ్యర్స్ నిర్మాతలని అప్రోచ్ అయ్యారు.
వాళ్ళు పట్టించుకోవడం లేదు అని ఛాంబర్ వద్దకు వెళ్లారు.దీంతో నిర్మాతలు కూడా వెళ్లాల్సి వచ్చింది. సినిమా నష్టాలు తీర్చాల్సిన బాధ్యత హీరోదే అని… మొదట అడిగిన దానికంటే 2 రెట్లు అతను పారితోషికం అందుకున్నాడని నిర్మాతలు హీరోని కార్నర్ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఆ నష్టాలు తీర్చాల్సిన బాధ్యత సిద్ధు పై పడింది. కొంతలో కొంత అంటే రూ.5 కోట్ల వరకు సిద్ధు (Siddhu Jonnalagadda) వెనక్కి ఇస్తే తప్ప నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు.. అతన్ని విడిచిపెట్టేలా కనిపించడం లేదు అని వినికిడి.