Skanda: రామ్ బోయపాటి కాంబో మూవీ ఆ రేంజ్ లో కలెక్షన్లను సాధించనుందా?

రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ నేడు థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా పక్కా బోయపాటి శ్రీను మార్క్ మాస్ మసాలా మూవీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా లేదని వీకెండ్ తర్వాత కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితం డిసైడ్ కానుందని తెలుస్తోంది.

రామ్ బోయపాటి స్కంద రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించడం సాధ్యమేనా? కాదా? అనే చర్చ జరుగుతోంది. సాధారణంగా బోయపాటి శ్రీను సినిమాలకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావు. అయినప్పటికీ ఇప్పటివరకు బోయపాటి శ్రీను తీసిన సినిమాలలో ఆరు బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. దాదాపుగా 70 శాతం సక్సెస్ రేట్ ఉన్న బోయపాటి శ్రీను సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన సందర్భాలు అయితే లేవు.

మరోవైపు స్కంద (Skanda) సినిమాలో రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రామ్ లో నటుడిని బోయపాటి శ్రీను సరిగ్గా వాడుకున్నాడని కథ, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ మూవీ అయ్యేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. స్కంద మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాత శ్రీనివాస్ చిట్టూరికి మంచి లాభాలను అందించింది.

ఈ నిర్మాత బోయపాటి శ్రీనుకు రూమ్ మేట్ కాగా స్నేహితునికి బోయపాటి శ్రీను మంచి లాభాలను అందించారనే చెప్పాలి. అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. బోయపాటి శ్రీను తర్వాత సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి మంచి లాభాలను అందిస్తే బాగుంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus